నవయుగ వైతాళికుడు గురజాడ వేంకట అప్పారావు
భాష, సంఘసంస్కరణాలే ధ్యేయంగా అడుగులు వేసిన గురజాడ వారు తర్వాతి తరాల వారికి అడుగుజాడవంటివాడని డా|| యం. ఇందిరా శాంతి అన్నారు. స్థానిక కె.వి. ఆర్. ప్రభుత్వ మహిళా కళాశాల తెలుగు అధ్యయన శాఖ ఏర్పాటు చేసిన గురజాడ జయంతి సభలో ఆమె అధ్యక్షులుగా వ్యవహరించారు. జీవితాంతం భాష కోసం, వ్యక్తి, సంఘ సంస్కరణల కోసం నిరంతరం శ్రమించిన మహాకవి గురజాడ వారని ఆమె తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులతో కూడి ప్రిన్సిపాల్ గారు గురజాడ వేంకట అప్పారావు గారి చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. తర్వాత తెలుగు విభాగాధిపతి డా|| జి. ప్రమీల మాట్లాడుతూ గురజాడ అనగానే గుర్తుకు వచ్చ్చే కన్యాశుల్కం గురించి, కన్యక, దిద్దుబాటు, మెటిల్డా వంటి మరెన్నో రచనలు ఆనాటి సమాజాన్ని చైతన్య పరచడంలో గొప్ప పాత్ర వహించారని అన్నారు. గురజాడ కవి స్త్రీ విద్య, చైతన్యం కోసం ఎంతో తపన పడ్డారని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డా|| దేవికా రాణి మాట్లాడుతూ కవి సమాజాన్ని ముందుకు నడిపించగలడని, గురజాడ వంటి గొప్ప కవులు ఈ సమాజానికి అవసరమన్నారు. డా|| పార్వతీ దేవి గురజాడ వారి దేశ భక్తి గేయాన్ని విద్యార్థులచే పాడించారు. డా|| లత మాట్లాడుతూ విద్యార్థులు మహాకవుల భావనలను అర్ధం చేసుకుని ప్రగతిని సాధించాలన్నారు. సదస్సులో శ్రీమతి జయ సుశీల, శ్రీ మణికంఠ, మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యార్థులు గురజాడ గురించి సభలో స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉన్నది.
0 comments:
Post a Comment
For suggestions / doubts / complaints