డా. పూలాల చంద్రశేఖర్ & డా. యస్‌ ఎ. సత్తార్‌కు ‘కర్నూలు జిల్లా రత్నాలు’ అవార్డు

 కర్నూలు వైద్య రంగ ప్రతిభలకు ఘన సన్మానం. డా. పూలాల చంద్రశేఖర్ మరియు డా. యస్. ఎ. సత్తార్‌కు ‘కర్నూలు జిల్లా రత్నాలు’ పురస్కారం అందజేత.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనారిటీ సంక్షేమ దినోత్సవం భాగంగా, కర్నూలు జిల్లా మేధావుల వేదిక ఆధ్వర్యంలో జిల్లాకు గౌరవం తీసుకువచ్చిన వైద్య ప్రముఖులు డా. పూలాల చంద్రశేఖర్ మరియు డా. యస్. ఎ. సత్తార్ గార్లకు “కర్నూలు జిల్లా రత్నాలు” అవార్డు అందజేశారు.

వైద్య విద్యా పరిపాలన మరియు హార్ట్ స్పెషాలిటీ రంగంలో సేవలందించిన డా. చంద్రశేఖర్, వైద్య బోధన మరియు ప్రభుత్వ వైద్య పరిపాలనలో విశేష సేవలందించిన డా. సత్తార్ తమ తమ రంగాల్లో కర్నూలు ప్రతిష్టను పెంచారు.

వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య యస్‌. మన్సూర్ రహ్మాన్ మాట్లాడుతూ, కర్నూలు వైద్య విద్యా చరిత్ర గర్వకారణమని, ఈ ఇద్దరు మహానుభావులు జిల్లా గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టారని తెలిపారు. కర్నూలు జిల్లా  విద్య,  వైద్య రంగాలలో 160 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉన్నదని, జిల్లా నుంచి 9 మంది విద్యావేత్తలు ఉపకులపతులుగా ఉన్నత స్థాయిని అధిరోహించారని,  13 మంది మేధావులు పద్మ పురస్కారాలను అందుకున్నారని రాబోయే కాలంలో డా. చంద్రశేఖర్ గారి సేవలకు ప్రభుత్వం  గుర్తించి పద్మ పురస్కారం యిచ్చే అవకాశం ఉన్నాదని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు 

      గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, కర్నూలు గాంధీ శ్రీ కె చంద్రశేఖర కల్కుర  మాట్లాడుతూ  మౌలానా అబ్దుల్ కలం ఆజాద్  దూరద్రుష్టి కారణంగానే ఈ రోజు నిపుణులయిన  మన దేశపు మానవసంపద  విశ్వ ఉద్యోగ విపణిలో  రాణిస్తున్నారని తెలియజేసారు. డా సత్తార్    మరియు డా. చంద్ర శేఖర్ ల ద్వయం గురుశిష్యులుగా వైద్యరంగంలో అపురూపమైన విజయాలను అందుకున్నారని పేర్కొన్నారు.  

    ఈ కార్యక్రమంలో  క్లస్టర్  విద్యాలయ డీన్  డా.  అఖ్తర్  బాను, విశ్రాంత ఉప సంచాలకులు, శ్రీ చిన్నరాముడు, విశ్రాంత డిఎస్పీ  శ్రీ పాప రావు,  బజమే ఐనా  సంపాదకులు , ఖుద్రతుల్లా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

డా. పూలాల చంద్రశేఖర్ గారు

  • డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి

  • హార్ట్ ఫౌండేషన్ & మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకుడు

  • వైద్య విద్యాభివృద్ధికి విశేష కృషి

KURNOOL RATNALU AWARD
కర్నూలు జిల్లా రత్నాలు

డా. యస్. ఎ. సత్తార్ గారు

  • కర్నూలు మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థి

  • ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య విద్య సంచాలకుడు

  • పదవీ విరమణ తర్వాత కూడా 27 ఏళ్లుగా సేవలందిస్తున్న వైద్యుడు


ఈ ఇద్దరు వైద్య మేధావులు కర్నూలు ప్రతిష్టను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. వీరు యువతకు ఆదర్శం.


Comments