ఉపాధి కొరకు హిందీ నేర్చుకోవడం ఎంతో అవసరం: రిజిస్ట్రార్, క్లస్టర్ విశ్వవిద్యాలయం, కర్నూలు

కర్నూల్: హిందీ భాషా దినోత్సవం – భాషాభిమానంతో భవిష్యత్తు సృష్టించండి

భాషాభిమానంతో భవిష్యత్తు సృష్టించండి

#Kurnool_News

హిందీ భాషా దినోత్సవం నిర్వహణ

సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో నేడు నిర్వహించిన హిందీ భాషా దినోత్సవం, విద్యార్థుల మనోబలాన్ని, సాహిత్య అభిలాషను ప్రేరేపించే విధంగా నిలిచింది.

అతిధుల ప్రసంగాలు

  • ప్రిన్సిపాల్: శ్రీ Dr.V.V.S కుమార్ గారు మాట్లాడుతూ, హిందీ భాష ఔన్నత్యం గురించి వివరించారు. హిందీ భాషను ఉపయోగించడం ఎలా మేలును చేస్తుందో వివరించారు.
  • ముఖ్య అతిథి: ఆచార్య శ్రీ కె.వెంకటేశ్వర్లు గారు, రిజిస్ట్రార్, క్లస్టర్ విశ్వవిద్యాలయం, కర్నూలు, ఉపాధి కొరకు హిందీ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేశారు.
  • విశిష్ట అతిధి: డాక్టర్ ఎస్. సలీంబాషా గారు, హిందీ విభాగాధిపతి ఉస్మానియా కళాశాల, కర్నూలు,

ఈ కార్యక్రమంలో హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

బహుమతులు


హిందీ విభాగం హిందీ దినోత్సవం సందర్భంగా 2024 సెప్టెంబరు నెలలో కాలేజీ విద్యార్థులకు పాడడం, కవితా పఠనం, వ్యాస రచన వంటి పోటీలు నిర్వహించబడింది.

అలాగే ఈ కార్యక్రమంలో పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించబడ్డాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ కార్యక్రమం అద్భతమైన సాంస్కృతిక కార్యక్రమముల ప్రదర్శనతో మరియు జాతీయ గీతాలాపనతో ముగిసింది, ఇది విద్యార్థుల ఉత్సాహాన్ని పెంచింది.

హిందీ విభాగాధ్యక్షురాలు ఎమ్. పార్వతి గారు మాట్లాడుతూ, హిందీ భాషను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు. హిందీ భాష ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో తెలియజేశారు.

ప్రేరణాత్మక సందేశం

సలీం గారు తన ప్రసంగం ముగిస్తూ హిందీ భాషపై ప్రేరేపిస్తూ "హమ్ హోంగే కామియాబ్" కవితను పాడారు., విద్యార్థులకు ఆత్మబలాన్ని, దృఢ సంకల్పాన్ని, విశ్వాసాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం నిర్వహించిన ఎమ్. పార్వతి హిందీ విభాగాధ్యక్షురాలు ప్రసంగిస్తూ హిందీ భాషను ప్రభుత్వం ప్రొత్సహించాలని తెలయజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీ ఆర్. ప్రసాద్ రెడ్డిగారు,గణిత విభాగాధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ సార్ గారు ప్రేరణదాయకమైన ప్రసంగాలు చేశారు.

© Yes Reach We Can Reach - Kurnool News. CC0 #Teamwork.

Comments