అసలు ఏంటి? ఈ సమాజం
ఎప్పుడు రద్దీగా ఉంటుంది?
ఒక రోజులో ఎందరు జన్మిస్తున్నారు?
ఎందరు మరణిస్తున్నారు?
అస్సలు ఎందుకు అల్లకల్లోలంలో ఉన్న
ఈ సమాజంలో ఉన్నావు?
అశాశ్వతమైన ఈ జీవితం కోసం,
ఎందుకు అంతలా పరితపిస్తున్నావు?
ఒకవైపు కుల, మతాల గొడవలు,
మరోవైపు రాజకీయ నాయకుల కుళ్ళు, కుతంత్రాలు
ఇక్కడ ఒకరిపై ఒకరికి ద్వేషం
అక్కడ వీరిద్దరిని కాపాడుటకు సైనికుని ప్రాణత్యాగం
ఇక్కడ ఒకరి నోటి దగ్గర ఉన్న అన్నం మెతుకులు
కాళ్లతో తోసేస్తారు ఇంకొకరు.
అక్కడ వీరిద్దరి కడుపు నింపుట కోసం
రైతు పడే కష్టం, కార్చే కన్నీరు
ఒకరిపై ఒకరికి ద్వేషం ఎప్పుడుపోతుంది?
మన భారతదేశం సస్యశ్యామలంగా ఉందా?
ఉదయాన్నే ప్రతివిద్యార్థి పాడే ఉన్న పదం, సస్యశ్యామలం.
ఆ పదం గురించి తెలుసుకున్న
విద్యార్థులు ఎంతమంది?
నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు!
మరీ అప్పటి బాలలు, ఇప్పటి పౌరులేగా!
ఈ సమాజం ఇలా క్షీణించిపొతుంటే
కళ్ళు ఉండి కూడా అలా చూస్తూ ఉన్నారు, ఇప్పటి పౌరులు.
న్యాయం జరగని చోట, న్యాయదేవతను ద్వేషిస్తారు కొందరు.
కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయ దేవత నీకు న్యాయం చేయాలి.
మరి నీకు కళ్ళు ఉండి కూడా
అన్యాయం జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఉండి పోయావు?
నీకు ఒక న్యాయం,
న్యాయ దేవతకు, ఒక న్యాయమా?
ఎందుకు ఈ వివక్షతపరమైన ఈ సమాజంలో ఉన్నావు?
ఎవరు మారుస్తారు ఈ మానవ సమాజాన్ని?
నువ్వు మారుస్తావా ఈ సమాజాన్ని ?
లేక ఈ సమాజం కోసం నువ్వు మారుతావా?
0 comments:
Post a Comment
For suggestions / doubts / complaints