కవిత కాదిది, కోపం.

 ఈ

చెండాలపు సృష్టిలో

నేనెందుకున్నాను

నాకీ బహిష్టు

వేదనెందుకు

పొత్తి కడుపుల ఒకటే నొప్పి

కాళ్ళన్నీ గుంజుతున్నయి

నరాలన్నీ తెగిపోతున్నయి

చేతులు పని జేస్తలే

వక్షోజాల వేదన 

భరించలేకుండా ఉంది

కళ్ళు మూసుకపోతున్నయి

నన్ను సృష్టించిన వాడు

కనిపిస్తే నరికేయాలని ఉంది

కత్తి తో పొడిచేయాలని ఉంది

వాడి గొంతు పై కాలు పెట్టి

తొక్కి పట్టాలని ఉంది

వాడికి నచ్చినట్టు నన్ను

సృష్టించి సంబరపడుతున్నడు

వాడిని చంపడానికి 

వెయ్యి కళ్ళతో

నేను ఎదురుచూస్తున్న.

వాడి మరణాన్ని సంబరంగా

జరుపుకుంటా.



సరిత



Share:
Location: Andhra Pradesh, India

0 comments:

Post a Comment

For suggestions / doubts / complaints