వీచే గాలిని అడుగు
నువ్వు ఎందుకు జీవిస్తున్నావో చెప్తుంది.
ప్రవహించే నీటిని అడుగు
నువ్వు భవిష్యత్తులో ఎదుర్కొనే ఎత్తు పల్లాల గురించి చెప్తుంది.
ఆకాశంలో కదిలే మేఘాలను అడుగు
నువ్వు ఎవరి మాటలు వింటే
నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్లను ఎలా పచ్చగా ఉంచగలగాలో చెప్తుంది.
నీ చుట్టూ ఉన్న పరిసరాలను అడుగు
ఆకాశంలో కదిలే మేఘాలను అడుగు నువ్వు ఎవరి మాటలు వింటే నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళను ఎలా పచ్చగా ఉంచగలగాలో చెప్తుంది.
నీ చుట్టూ ఉన్న పరిసరాలను అడుగు
నువ్వు ఎటువంటి జీవన విధానం కొనసాగిస్తున్నావో చెప్తుంది.
కనిపించే పెద్ద పెద్ద శిఖరాలను అడుగు
నువ్వు ఎటువంటి సాహసాలు చేస్తే నన్నుఅధిరోహించగలుగుతావో చెప్తుంది.
కళ్ళ ముందు కనిపించే అవకాశాల కూటమిని అడుగు
నువ్వు ఎటువంటి మార్గంల్లో వెళ్తే
నీవు నీ గమ్యాన్ని చేరుకోగలుగుతావో చెప్తుంది.
వీటన్నింటిని గమనిస్తూ, వాటి గురించి ఆలోచిస్తున్న
నీ మనసాక్షిని అడుగు
నువ్వు నీ జీవన పయనాన్ని ఎక్కడి నుండి మొదలుపెట్టాలో చెప్తుంది.
0 comments:
Post a Comment
For suggestions / doubts / complaints