చెలికాడా...
ఈ ప్రపంచానికి దూరంగా
ఈ సమాజాన్ని వెలివేసి
ప్రకృతి ఒడిలో
సముద్రం ఒడ్డున
అలల తాకిడికి
నీతో నేను మైమరచిపోవాలి
నీ చేతిలో చేయి వేసి
లోకమంతా చుట్టేసి రావాలి
నీ చిన్ని కళ్ళల్లో నన్ను నేను
బంధీని చేసుకోవాలి
నీ ఉచ్శ్వాస నిశ్వాస లో
నేను లీనమైపోవాలి
నీ వక్షస్థలం లో నన్ను నేను
దాచుకోవాలి
ఓ నా చెలికాడ..
ఈ రాతిరి లో
వెన్నెల కింద
నీతో నేను ఏకమైపోవాలి
రెండు శరీరాలు
ఒక్కటవ్వాలి
రెండు మనసులు
జతకట్టాలి
రెండు ఆత్మలు
ఒక్కటి చేసే సౌఖ్యాన్ని
తనివితీరా పొందాలి.
తాళి, బొట్టు లేని
స్త్రీ ని అవ్వాలి
వాటి స్థానం లో
జాలి,దయ, ప్రేమ ని
ధరించాలి
పుణ్య స్త్రీ గా కాదు
నీలో ఏకమై జీవితానికే
ఓ నిర్వచనమై
మరణించాలి
సరిత
Comments
Post a Comment
For suggestions / doubts / complaints