ఇదే ఆ చోటు
అమాయకత్వం గా
భయం భయం గా
తడబడుతూ
అడుగు పెట్టిన చోటు
అప్పుడే
అక్కడే
కలిశారు
ఆ ఇద్దరు
నాకు చెరో భుజం
చెరో కన్ను గా
తిరిగిన చోటు
ఇదే ఆ చోటు
ఎక్కడో తప్పిపోయిన
చంటి పిల్లాడు
మళ్ళీ కనిపించినంత
సంబరంగా ఉంది
ఆ ఇద్దరూ
మళ్ళీ ఇక్కడే
కనిపించారు
చెట్టు కింద కూర్చొని
తెచ్చుకున్న లంచ్ బాక్స్
ఒక్కో ముద్ద ఆబగా
తింటున్నట్టు
ఒక్కో జ్ఞాపకం మనసులో
కదలాడుతుంది
కళ్ళు చెమ్మగిల్లాయి
గుండె బరువెక్కింది
అక్కడే పడిపోయిన
కొన్ని మధుర స్మృతులని
నవ్వులని
దోసిట్లో పట్టుకొచ్చి
మదిలో భద్రంగా దాచాను..
________
సరిత
0 comments:
Post a Comment
For suggestions / doubts / complaints