జై తెలంగాణ

 


అరిచి అరిచి

మూగబోయిన

గొంతులెన్నో..

కాలిపోయిన

దేహాలెన్నో..


కన్నతల్లులకి దుఃఖపు శోకాలెన్నో..


అరిచి అరిచి

గొంతులు చించుకుని

హోరెత్తించిన నినాదం

నీళ్లు, నియామకాల

సాకు తో

తెచ్చుకున్న బంగారు తెలంగాణ నినాదం

ఇయ్యాల ఒక్కసారిగా

మూగబోయింది


లాఠీల దెబ్బలు

ర్యాలీలు

కడుపుకోత లు

ఇచ్చిన నా బంగారు తెలంగాణ నినాదం 

ఎక్కడో

ప్రగతి భవన్ల, ఫామ్ హౌజుల

పునాదిరాయి గా చతికిలబడ్డది.

అదే పునాది రాయి కింద

 నా దేశపు యువత 

పెరిగిపోతున్న

వయస్సు తో

బూడిదైతున్న కలలతో

నలిగిపోతూ మళ్లీ మళ్ళీ

నినదిస్తుంది  'జై తెలంగాణ ' అని.



సరిత







Share:
Location: Telangana, India

0 comments:

Post a Comment

For suggestions / doubts / complaints