కొన్ని
ప్రాణులు
ఒట్టి మాంసపు ముద్దలు
కుళ్ళిపోయిన కళేబరాలు
కంపు కొడుతున్న ఆలోచనలు
జీవం కోల్పోయిన శిల్పాలు
చలనం ఎరుగని జీవాలు
ప్రేమనెరుగని జ్ఞానులు
అవి..
అవి..
ఒట్టి రాతి బండలు
సముద్రం ఒడ్డున కూడా
ఉండడానికి పనికి రాని
రాళ్ళు అవి
చీకట్లోనే బ్రతుకునీడ్చే
పిచ్చి ప్రాణులు అవి.
సరిత
Comments
Post a Comment
For suggestions / doubts / complaints