Practice everyday :
గత TET మరియు DSC పరీక్షలలో అడిగిన ప్రశ్నలను తరచుగా ప్రాక్టీస్ చేయాలి.
TET DSC coaching without fees ?
ఎలా అంటే ఈ మధ్య కాలంలో చాలా యూట్యూబ్ వీడియోలు రెగ్యులర్గా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి కదా వాటిని మన సబ్జెక్ట్ సిలబస్ తో సరిచూసుకుని మన సొంత అక్షరాలతో నోట్స్ తయారు చేయాలి. ఎందుకంటే మన రైటింగ్ మనం త్వరగా రివిజన్ చేసుకోగలం.
* కోచింగ్ మరియు వీడియోల తో పాటు సొంత ప్రిపరేషన్ మొదలు పెట్టండి.
* ఉచితంగా దొరికే మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి మరియు ఎక్కడ తప్పులు చేస్తున్నామో సరిచూసు కోవాలి, వీటిపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి.
రాబోయే DSC కి ఇలా ప్రిపేర్ అవ్వాలి
* మన సిలబస్ కంటెంట్ కి మ్యాచ్ అయ్యే AP SCERT పుస్తకాలు, ఇతర పుస్తకాలు, వీడియో లు , ts/ ap DSC బిట్ బ్యాంక్ , PDF మరియు కరెంట్ అఫైర్స్ లలో వెతికి మన సబ్జెక్ట్ కంటెంట్ కు సంబంధించిన సిలబస్ పూర్తి చేయాలి.
అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ గా అర్థం చేసుకుంటూ తపన తో చదవాలి.
ఔట్ ఆఫ్ సిలబస్ తో దొరికే పుస్తకాలు / వీడియోలు/ ఇతర సమాచారాన్ని వెంటనే గుర్తించగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
ఒక్క DSC ఛాన్స్ మిస్ అయినా మనం మానసికంగా మరియు ఆర్థికంగా చాలా బాధ పడతాం కాబట్టి వచ్చే మూడు నెలల వరకు ఏం చదవాలి , ఎలా చదవాలి అనే ప్లాన్ తప్పకుండా రెడీగా ఉండాలి.
ప్రతీ రోజు DSC ప్రాక్టీస్ తప్పనిసరిగా పాటించాలి. అన్ని చాప్టర్ లూ అప్పుడప్పుడు చదువుకుంటూ రివిజన్ చేస్తూ ఉంటే మరచిపోయే ఛాన్స్ లేదు.
రోజూ మనం ఎన్ని గంటలు చదివాం అన్నది ముఖ్యం కాదు. ఎన్ని చాప్టర్ లు మరియు ఎన్ని టాపిక్ లు ప్రతిరోజూ రివిజన్ చేశామన్నదే ముఖ్యం.
0 comments:
Post a Comment
For suggestions / doubts / complaints