బ్రతుకు ఈర్చడం కష్టంగా ఉన్న మనిషికి బ్రతకడానికి చక్కటి బాట చూపిస్తే, అది కటిక చీకటి లో కాంతిపుంజ మువలె అతడిని చేరుతుంది
తనను కన్నవారిని కావలసిన దానికన్నా ఎక్కువ గౌరవించి, భర్త వైపు బంధువులను ఇబ్బంది పెట్టే భార్యల వలన బ్రతుకు సాఫీగా సాగదు.
ఆ.వె
బతుకు నీడ్చ లేని బడుగు జీవికిపుడు
బతుకు నీడ్చ గల్గు బాట చూప
కటిక చీకటందు కాంతి పుంజమువోలె
చేరు నతడిదరికి చిన్నిమాట
తే.గీ
తనను కన్నవారకిడుచు తగని విలువ
భర్త వైపు బంధువులను బాధ పెట్ట
బ్రతుకు చెదిరిపోగలదిట్టిభార్య వలన
చిన్ని చెప్పును మాటలు చెలిమి తోడ
శుభోదయం
మీ శ్రేయోభిలాషి
డా. కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి (Dr.kvs) 9538742224
VISAKHAPATNAM
Comments
Post a Comment
For suggestions / doubts / complaints