కలిపురుషుని మహిమ వలన కష్టాలు వస్తున్నాయని

 కలిపురుషుని మహిమ వలన కష్టాలు వస్తున్నాయని మంత్రాలు వల్లించి జపాలు చేస్తే ఏమాత్రం మంచి జరగదు. మహిమలకన్నా చెడ్డను ఎదుర్కోవడానికి మనిషి గుండె బలమే గొప్పది. ముందు మనిషి కష్టపడాలి ఫలితం భగవంతుడు వదిలిపెట్టాలి. అదే గీతా సారం.

నీతిమార్గాన్ని ప్రేమగా అనుసరిస్తూ, ప్రజల మేలు కోసం ఎల్లప్పుడూ శ్రమించే నాయకుడిని సమాజం ఎప్పటికీ మరచిపోదు.

ఆ.వె

కలిపురుషుని మహిమ కాన వచ్చినదని

మంత్ర జపము సేయ మంచి రాదు

మనిషి గుండె బలము మహిమ కన్న ఘనము

చెడ్డ కెదురు నిలువ చిన్ని మాట

తే.గీ

నీతి నియమాల బాటించనిష్టగలిగి

ప్రజల మంచి కొరకెపుడు పాటుపడెడి

మంచి నేతను సంఘంబు మరువదనుచు

చిన్ని చెప్పును మాటలు చెలిమి తోడ


శుభోదయం

మీ శ్రేయోభిలాషి 

డా. కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి (Dr.kvs) 9538742224 

VISAKHAPATNAM

Comments