శీర్షిక..ఒంటరితనం
నిశ్శబ్దంగా కౌగిలించుకుంటుంది
గుండెల్లో గుబులు పుట్టిస్తోంది
అంతరంగాన్ని శోధిస్తుంది
బాధల గాధలను నెమరువేస్తూ..
బంధాలూ అనుబంధాలూ
మాయమయినవేళ
నవ్వుతూ పలుకరించడమే శాపమయిన వేళ
నవ్వుకుంటుంది మనసులో
నీవెవ్వరంటూ? నీ ఉనికిని ప్రశ్నిస్తుంది..
గుండెకు గాయం చేస్తుంది
గడిచిన తీయని జ్ఞాపకాలతో
కూసింత మైమరిచిపోతుంది
భవ బంధాలు శాశ్వతం కాదని
తనలో తానే మథన పడుతుంది
ఇంతేనా! ఈ జీవితమని
చివరికి మిగిలేది ఏమిటని!
పాఠం నేర్పుతుంది
వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చావు గదా!
పోయేటప్పుడు నీవెంటవ్వెరూ రారుకదా!
ఆలోచించు మిత్రమా! ఒంటరితనమే జీవన పోరాటమని..
శూన్యంలోకి చేతులు చాస్తూ అర్ధిస్తుంది
నీ దగ్గరికి చేరే ఒంటరితనంలో ఎంతో ప్రశాంతత ఉందని..
ఒక్కొక్కసారి అనిపిస్తుంది
అసూయా ద్వేషం మోసం కపటంతో
జూదం ఆడుతున్న ఈ మాయా లోకంలో
ఒంటరితనమే ఎంతో హాయిగా ఉందని
పరుగులు తీసే కాలంతో పాటు మారుతున్న
నేటితరం ఒంటరితనాన్ని కొనుక్కుంటూ
పిచ్చిగా పరుగులు తీస్తుంది..!
ఃఃఃఃఃఃఃఃఃఃఃః
Padmavathi, Hyd,
Comments
Post a Comment
For suggestions / doubts / complaints