రాబోయే రోజుల్లో ఒక్క ముత్యపు చినుకూ విలువ దొరుకుతుంది. దయ కోరడం ఒక మౌనప్రార్థన అయితే, ఒక్క చుక్కనీ వృధా చేయకుండా సక్రమంగా వినియోగించడం మన చేతుల్లో ఉన్న పుణ్యకార్యం.
జీవనాధారమైన ఒక నీటి చుక్కకోసం దేవుని ప్రార్థించి,
దొరక చేతికి వచ్చినదాన్ని వృథాగా పారబోసితే అది దోషమే.
నీరు లేని వసుధ నిజంగా నరకమే— ఇది లోతుగా చింతించవలసిన విషయం. ఈ అమూల్య వరాన్ని దైవాన్నిఆరాధించి కోరడం ఒక అడుగైతే,
దానిని వివేకంతో వినియోగించి ఒక్క చుక్క కూడా వృథా కాకుండా గౌరవించడం అంత కన్నా గొప్ప సద్గుణముగా భావించవలయును.
స్వార్థ భావాలను విడనాడి సద్గుణసంపన్నుడై,
సాటి మనుషుల శ్రేయస్సు కొరకు పాటుపడే వాడు
ఈ భూమిపై గౌరవింపబడుతూ ఆనందముతో, గౌరవంతో జీవిస్తాడు.
ఆ.వె
నీటి చుక్క కొరకు నింగినే ప్రార్థించి
దొరక పారబోయ దోష మగును
నీరు లేని వసుధ నిజముగా నరకంబు
చింత జేయ మనెను చిన్నిమూర్తి
తే.గీ
స్వార్థ భావంబు విడనాడి సాధువగుచు
సాటి జనులు మంచి కొరకు పాటుపడెడి
మనిషిమహిలోన ముదముగ మాన్యు డగును
చిన్ని చెప్పును మాటలు చెలిమి తోడ
శుభోదయం
మీ శ్రేయోభిలాషి
డా. కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి (Dr.kvs) 9538742224
VISAKHAPATNAM
Comments
Post a Comment
For suggestions / doubts / complaints