పువ్వు వాడి పోగానే దాని విలువ పూర్తిగా పోదు . ఎందుకంటే అది మనకు చాలా తీపి గుర్తులు మోసుకొచ్చింది కాబట్టి. అలాగే మనిషి చనిపోయినంత మాత్రాన అతను చేసిన మంచి పనుల వలన జనం అతనిని మర్చిపోరు.
జరిగిపోయిన సంఘటనలు తలుచుకుని బాధపడకుండా, ప్రస్తుతం మంచి పనులు చేసి ఘనమైన భవిష్యత్తును నిర్మించుకోవటం ప్రతి మనిషి బాధ్యత.
ఆ.వె
పువ్వు వాడగానె పోదు దాని విలువ
తీపి గుర్తు లెన్నొ తెచ్చె గాన
మనిషి పోయినంత మరిచిపోరు జనులు
చేయమంచి పనులు చిన్నిమూర్తి
తే.గీ
భూతకాలం తలుచుకొని బోరు మనక
వర్తమానమందున మంచి పనులు చేసి
భవిత నిర్మించుట మనిషి బాధ్యతనుచు
చిన్ని చెప్పును మాటలు చెలిమి తోడ
శుభోదయం
మీ శ్రేయోభిలాషి
డా. కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి (Dr.kvs) 9538742224
VISAKHAPATNAM
Comments
Post a Comment
For suggestions / doubts / complaints