బలము ఉండి కూడా ఇతరులకు భజన చేసి

 బలము ఉండి కూడా ఇతరులకు భజన చేసి గాని బతకలేని జీవితం భారం అవుతుంది. అటువంటి బ్రతుకు దుర్భరం. కాబట్టి మనిషన్నవాడు ఈ భూమి మీద ధైర్యాన్ని విడవకుండా మంచి దమ్ముతోటి బ్రతకడం నేర్చుకోవాలి.

తను నివసించే గుడిసెను కప్పుకొనుటకు కొబ్బరాకు లేకపోయినా గుండె నిండా నమ్మకం గూడు కట్టుకొని ఉండటం వలన, మనిషి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొడతాడు. అదే అతని నిజమైన గూడు.

ఆ.వె

బలము కలిగి కూడ భజన చేసిన గాని,

బ్రతక లేని బ్రతుకు భారమగును

ధైర్యము విడకుండ దమ్ము తోడ ధరను

చివరి వరకు బ్రతుకు చిన్నిమాట

తే.గీ

గుడిసె కప్పు కొనగలేదు కొబ్బరాకు

గుండె నిండ నమ్మకమను గూడువలన

గుడిని కొబ్బరికాయను కొట్టు నొకడు

చిన్ని చెప్పును మాటలు చెలిమి తోడ


శుభోదయం

మీ శ్రేయోభిలాషి 

డా. కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి (Dr.kvs) 9538742224 

VISAKHAPATNAM

Comments