ముందువచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ముల వాడి ఎక్కువ అన్నట్లు , ఈ భూమి మీద అసలుకన్నాకొసరే ఎక్కువ. ముందు ఉన్న తల్లి కన్నా వెనుకవచ్చిన భార్య ముద్దు, ముందు పుట్టిన కొడుకు కన్నా తరువాత వచ్చిన మనువలే ముద్దు.
లోభం బుద్ధిని నాశనం చేసినప్పుడు, మనిషి ధనం వెనుక అంధంగా పరుగు తీయడం మొదలుపెడతాడు.
జాగ్రత్త, అప్రమత్తత లేకపోతే జారిపడి పడిపోతాడు.
పనులన్నింటిలో అతిశయమైన తొందర రక్తపోటును మాత్రమే పెంచుతుంది. లోభం, అసహనం—జీవితంలోనూ, ఆరోగ్యంలోనూ సమతుల్యతను కోల్పోయేలా చేస్తాయి.
ఆ.వె
మొదట వచ్చు చెవుల పదును కన్న, వెనక
వచ్చు కొమ్ముకుండు వాడియటుల
యసలు కన్న జూడ కొసరుమిన్నధరను
చింతచేసిచూడ చిన్నిమూర్తి
తే.గీ
పసిడి నాశించి మనుజుండు పరుగు తీయ
జాగ రూకతలేకున్న జారిపడును
రయము పనుల జేయపెరుగు రక్తపోటు
చిన్ని చెప్పును మాటలు చెలిమి తోడ
శుభోదయం
మీ శ్రేయోభిలాషి
డా. కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి (Dr.kvs) 9538742224
VISAKHAPATNAM