తెలుగు కలకండ కందాలు: చందు.
చదవండి పద్య రథము
మదిబండి నడుపుటలోని మర్మము తెలియున్;
కథవుండు దేనికైనను
చెద వుండిన ఇంటినిండ చెదరం గొట్టున్ !
కదలండి యుద్ధ రీతుల
వదలండయ పైత్యమున్న వగపులు వీడన్;
మెదలండి లోక మంతట
చెదలుండెను దేశమంత చేతన లేవిన్ !
రాయని కలాల సైన్యము
ధ్యేయము నిండుకొనినంత దేబిరి తనమెన్ ;
సోయమ్ము లేని మనుషులు
గాయమ్ముల తెలుగుకీర్తి గాథలు వినకెన్ !
ముంపు మనముందు తెలిసి
తెంపుకు సంసిద్ధపడిన తెలివది వచ్చున్;
గుంపులొ గోవింద యనక
కెంపుగ మెరవంగ మిగుల కాకలు దేరున్ !
నిర్మాణ రంగములలో
కర్మాధారితములున్న కథలను పెంచున్ !
ధర్మమ్ము బోధయనుచూ
మర్మానుగతమ్ము వారు మాయలు జేయున్ !
📗🖋️📗🖋️📗 🖋️📗🖋️📗🖋️
Comments
Post a Comment
For suggestions / doubts / complaints