అందరికీ.....
"గణిత దినోత్సవం"
శుభాకాంక్షలు
+ - × ÷ > < π $ £ € ~ {%₹@
🌹💐🌷🌹💐🌷🌹🤝🙏
ఈ ప్రపంచంలో లెక్కలు (Mathamatics) రానిది ఎవరికో తెలుసా?
'మన అమ్మలకి.. మన నాన్న' లకి..
ఎట్లనో తెలుసా...???
👉 ఆకలి అవుతోందమ్మా అంటే...
2 చపాతీలు పెట్టమంటే..4 పెడుతుంది.
👉 పొద్దున్నే 6 గంటలకు లేపి..8 అయ్యిందిరా.. లేవరా.. అంటూంది.
👉 పరీక్షల్లో నూటికి 36 మార్కులొస్తే..
పక్కింటోళ్లకు మావాడికి 63 వచ్చాయని చెప్తుంది
👉 బయటకు వెళ్ళాలి ఖర్చులకు ..ఓ యాభైరూపాయలు ఇవ్వమంటే..
పోపులడబ్బా నుండి 100 తీసి ఇస్తుంది.
👉 దొంగచాటుగా సెంకడ్ షోకి వెళ్ళి రాత్రి ఒంటిగంటకొచ్చి పడుకుంటే...
పొద్దున్నే నాన్నకి తెలిసి కేకలేస్తే రాత్రి పదింటికే పడుకున్నాడండి..అని కవర్ చేస్తుంది.
👉 బయట ఊళ్ళో చదువుకునేటప్పుడు.. ఖర్చులకు 1000 పంపించ మంటే 1500 పంపేవాడు నాన్న..
👉 మా నాన్న చెల్లికి నాకంటే ఒక చాకోలెట్ ఎక్కువ ఇచ్చి.. ఇద్దరికీ సమానం అనేవాడు
👉 పెళ్లి సంబంధాల సమయంలో నా ఆదాయాన్ని రెట్టింపు చేసి చెప్పేవాడు నాన్న!
👉 మనందరి అమ్మా నాన్నలకు నిజంగా సర్వసమీకరణాలు తెలియవు..
కుటుంబంలో అందరినీ సర్వ సమానంగా చూడడం తప్ప!
👉 F L N లో న్యూమెరెసీలో చాలా వీక్..
కుటుంబ ఆదాయాన్ని కూడడమే తప్ప..
తీసివేయడం రాదు!
కుటుంబంలో ప్రేమ, ఆత్మీయతలను హెచ్చించడమే తప్ప..
భాగించడం తెలీదు!
👉 బారువడ్డీల లెక్కలు అస్సలే తెలియవు..
ఎందుకంటే ఎన్ని డబ్బులిచ్చినా తిరిగి వడ్డీతో అడగడం తెలీదు..!
👉 మన వాళ్లకు రామానూజన్ నంబర్.. 1729 అంటే తెలీదు...
వాళ్లకు తెలిసింది ఒక్కటే..
17 ఏళ్ల వరకు చదివించాలి
29 ఏళ్లలో పిల్లాపాపలతో సెటిల్ అవ్వాలి..!
👉 వాళ్లకు తెలిసింది..
కుటుంబంలో మ్యాట్రిక్స్..!
ప్రేమల్ని, గౌరాభిమానాల్ని సర్వ సమానంగా పంచే ఆల్ జీబ్రా!
ఇంటిని అందంగా, సౌకర్యవంతంగా ఉంచే త్రికోణమితి!
ఇంటి జమా ఖర్చులను చూసే సాంఖ్యక శాస్త్రం!
👉 నిర్ణయాలు తీసుకునే సమయంలో సంభావ్యత!
నిజంగా వాళ్లకు లెక్కల చిక్కులు తెలియవు.. ఎందుకంటే!..
వాళ్ళు చదివింది..
డిగ్రీలో Mathematics కాదు..
వాళ్ళు చదివింది..
"మేధ్ మే ట్రిక్స్"...!
వాళ్ళు చదివింది..
Life లో Ethics..!
🌹💐🌷🌹💐🌷🤝🙏
✍️
Comments
Post a Comment
For suggestions / doubts / complaints