బస్ యాత్ర
మేము 5 గురు మిత్రులందరూ సాయంత్రం 4 గంటల బస్ కి పోవటానికి నిర్ణయించుకున్నాము “పన్నా నుండి కంపెనీ యొక్క బస్ ‘సత్నా’ కు గంట తర్వాత వస్తుంది. ఆ బస్సే జబల్ పూర్ ట్రైన్ ను ఎక్కించ గలుగుతుంది. అట్లయితేనే ఉదయం ఇంటికి చేరుకోగలము. మాలో ఇద్దరికీ ఉదయం నుండే పనికి పోయేది ఉంది. ఇందువలన తిరిగిరావటానికి కూడా ఇదే దారి వెంట వచ్చి తీరాల్సిందే. అక్కడున్న ప్రజలంతా ఇచ్చిన సలహా ఏమిటంటే బుద్ధి ఉన్నవాడు ఎవ్వడు కూడా సాయంత్రం వచ్చేటటువంటి బస్ లో ప్రయాణం ఎప్పటికీ చేయడు. ఎదుట ఉండే వాళ్ళు అడిగేను ‘అలా ఎందుకు ? దారి మధ్యలో ఎవరైనా దొంగలు, దయ్యాలు, దోపిడిదారులు వస్తారా ?. అతని ప్రశ్నకు జవాబుగా ఒకతను చెప్పెను అక్కడ దయ్యాలు, దొంగలెవరూ, రారు ఆ బస్సే ఒక దయ్యం.
బస్ ని చూసిన వెంటనే నా ఇష్టం బలపడిపోయింది పూర్తిగా ముసలిది. ప్రాచీన కాలంనాటి చివరి జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పవచ్చు. అందువలన ప్రజలు కూడా దానిలో ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. అలాగే ఎక్కి ముసలితనంలో ఉన్న బస్ ని ఎక్కితే దానికే కష్టం అని అనుకుంటారు. ఆ బస్ కేవలం పూజ చేసి మంగళ హారతి ఇవ్వటానికి మాత్రమే యోగ్యమైనది. దాని మీద ప్రయాణం ఎలా అవుతుందో !
బస్ కంపెనీ కి చెందిన ఒక భాగస్తుడు కూడా అదే బస్ లో ప్రయాణం చేశాడు. మేము అతన్ని అడిగాము “ఈ బస్ నాడుస్తాదా ?” అతను చెప్పెను “ఎందుకు నడవదండి! ఇప్పుడే నడుస్తాది”. మేము చెబితిమి - “అదే మేము చూడాలని అనుకుంటున్నాము దానంతట అదే నడుస్తుందా ఇది? అవునండీ! లేకపోతే ఎలా నడుస్తుంది”.
నాకు ఆశ్చర్యం వేసింది. ఇలాంటి బస్సు తనంతట అదే నడుస్తాదా! మేము వెనక్కి ముందుకి తిరుగుతుంటే అక్కడే ఉన్న డాక్టర్ మిత్రుడు చెప్పెను “భయపడొద్దు, వెళ్ళండి! బస్సు అనుభవజ్ఞురాలు. కొత్త కొత్త బస్సుల కంటే ఎక్కువ నమ్మదగినది. మనల్ని కొడుకులా ప్రేమతో ఒడిలో పెట్టుకుని తీసుకొని పోతుంది.
మేము కూర్చున్నాము. ఎవరైతే వదిలిపెట్టడానికి వచ్చారో వారందరూ ఎలా చూస్తున్నారంటే ‘చివరి చూపులు’ ఎలాగైతే చూస్తారో అలా… వారి కన్నులు చెప్పిందేమిటంటే - “రాక-పోక అనేవి నిత్యం ఉంటాయి. వచ్చారు, అంటే వెళ్లాలి - రాజు అయినా, వేశ్యుడు అయినా, సాధువులు అయినా, ఫకీరులు అయినా…. మనిషికి బరువు కాకుండా ఉండడానికి కొన్ని కారణాలు, సాధనాలు కావాలి”.
ఇంజను నిజంగా స్టార్ట్ అయిపోయింది. ఎలాగంటే మొత్తం బస్ ఇంజను మాత్రమే మరియు మేము ఇంజన్ లోపల కూర్చున్నాము. అద్దాలు కూడా కొన్ని మాత్రమే మిగిలాయి, వాటి నుండే మేము బయటపడి బ్రతకటానికి సులువైన మార్గం. మేము వెంటనే కిటికీ నుండి దూరం వెళ్లి కూర్చున్నాము. ఇంజన్ నడుస్తుంది కానీ మాకి అనిపించిందేమిటంటే మేము కూర్చున్న సీటు కింద ఉంది ఇంజను.
నిజంగా బస్ నడవడం మొదలైంది మరియు మాకు అనిపించిందేమిటంటే ఇది గాంధీజీ యొక్క సహాయ నిరకారనోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం కాలంలో యవ్వన వయస్సు లో ఉండవచ్చు. దానికి అప్పుడే శిక్షణ ఇచ్చి ఉండవచ్చు. దాని బాడీలోని ప్రతి భాగం విముక్తి కోరుకుంటున్నాయి. ఆ బస్సు క్విట్ ఇండియా ఉద్యమం సమయం నుండి నడుస్తూ ఉండవచ్చు. సీట్లు వెనుకకు, ముందుకు జరుగుతూ ఉన్నాయి, ఒక్కొక్కసారి ఇంజను దగ్గరకు వెళ్లి తిరిగి వస్తున్నాయి. 8, 10 మైళ్ళ దూరం వెళ్ళాక మరొక సందేహం పుట్టెను అదే మేము సీటు మీద కూర్చున్నామా లేక మా మీద సీట్లు కూర్చున్నాయా?
ఉన్నట్లుండి అకస్మాత్తుగా బస్ ఆగిపోయింది. ఎందుకని పరిశీలిస్తే తెలిసిందేమిటంటే పెట్రోల్ ట్యాంకు కు రంధ్రం పడింది. డ్రైవర్ ఒక బకెట్ లో పెట్రోల్ తీసి అతని ప్రక్కన పెట్టుకొని ఒక గొట్టం ద్వారా ఇంజిన్ లోకి పోయసాగాడు. తరువాత నాకు అనిపించిందేమిటంటే కొద్దిసేపు ఉంటే ఇంజన్ ఓడిపోయినట్లయితే తీసి తన ఒడిలో పెట్టుకుంటాడేమో…. మళ్లీ దానికి పెట్రోలు తాగిస్తాడేమో…. ఎలాగంటే అమ్మ చంటి పిల్లాడికి ఒడిలో వేసుకుని పాలు తాపిస్తుందో.
బస్సు స్పీడ్ ఇప్పుడు 15 - 20 మైళ్ళు అయిపోయింది. నాకైతే దాన్ని ఏ భాగం మీద కూడా భరోసా లేదు. బ్రేకులు పనిచేయకుండా అయిపోవచ్చు, స్టీరింగ్ విరిగిపోవచ్చు. ప్రకృతి దృశ్యాలు కూడా ఉద్దీపనంగా మారిపోయాయి. ఇరువైపులా పచ్చని చెట్లు, వాటి మీద పక్షులు కూర్చున్నాయి. నేనైతే ప్రతి చెట్టుని శత్రువుగా భావించడం మొదలుపెట్టాను ఎందుకంటే ఆ చెట్లను చూస్తే భయం పుడుతుంది. ఏ చెట్టును బస్సు గుద్దేస్తుందో అని. చెట్టు వెళ్ళిపోతే హమ్మయ్య!... అని శ్వాస తీసుకునే లోపే ఇంకొక చెట్టు వచ్చి ఢీ కొడుతుందేమోనని ఎదురు చూడటం కొనసాగించాను. నీ ఎదురుగా సరస్సు వచ్చినట్లయితే నాకు అనిపిస్తూఉండేది బస్సు దాంట్లో పడి మునిగిపోతాదేమో అని. మళ్లీ ఉన్నట్లుంది బస్ ఆగిపోయింది. డ్రైవర్ అన్ని విధాల - సర్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ముందుకు మాత్రము కదల లేకపోయింది, మళ్ళీ నా శాసనల్లోంఘన ఉద్యమం ఆరంభమైపోయింది. కంపెనీ యొక్క భాగస్తుడు చెప్పిందేంటంటే “బస్ అయితే ఫస్ట్-క్లాసందడి! ఇది మామూలుగా అయినటువంటి పరిస్థితి. ఆ కంపెనీ భాగస్తుడు, డ్రైవర్ మరియు కండక్టర్ ఇంజన్ తెరిచి కొన్ని ప్రయోగాలు చేశారు. దానితో బెస్ట్ కొంచెం ముందుకు నడిచింది కానీ కొద్దిసేపటికి దాని పరిస్థితి దిగజారిపోయింది. వెన్నెలలో చెట్ల నీడ కింద ఆ బస్ ని చూస్తే జాలేసింది. దానిని చూసి నాకు అనిపించింది ఏమిటంటే ఎవరో ఒక ముసలావిడ అలసిపోయి చెట్టు కింద కూర్చోంది. మాకు గిల్టీగా అనిపించింది అయినా అదే అమాయకపు బస్ మీదే అటు - ఇటు ఊగుతూ, గట్టిగా పట్టుకుని వస్తున్నాము. ఒకవేళ బెస్ట్ తన ప్రాణంను ఆటాత్తుగా వదిలేస్తే దాని అంతిమ సంస్కారాలు చేయాల్సింది, మేమే…
నెమ్మది - నెమ్మదిగా బస్ కి కన్నులలో జ్యోతి కూడా ఆరిపోవడం మొదలైంది. ఆ వెన్నెలలో దారి ఎత్తుపల్లాలను తాకుతూ శుభం పలుకుతుంది. ముందు వెనుక నుండి ఏదైనా వాహనం వస్తున్నట్లు కనిపించినట్లయితే వెంటనే బస్ దారికి ఒకవైపు నిలబడి “వెళ్ళిపో… బిడ్డ! నాకైతే నీ వయసు లేనేలేదు” అని చెబుతుంది.
ఒక వంతెన పై చేరుకున్న వెంటనే బస్ గాను (టైర్) పంచర్ అయ్యి, గట్టిగా శబ్దం చేస్తూ ఊగి - ఊగి నిలబడిపోయింది. ఒకవేళ వేగంగా వచ్చినట్లయితే బస్సు దారి తప్పి కాలువలో పడిపోయేది. నేను ఆ కంపెనీ భాగస్తుని వైపు మొదటిసారి జాలి, దయ భావనలతో చూశా. ఆ చక్రాల యొక్క పరిస్థితి తెలిసి కూడా అరచేతిలో ప్రాణం పెట్టుకుని ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. “ఇంత నమ్మకం కలిగి ఉండడం అపాయం”. ఈ మనిషి యొక్క సాహసం, బలిదానం, తగిన పనులకు ఉపయోగం అవ్వట్లేదేమో, అని నాకు అనిపించింది.
ఈ మనిషి కచ్చితంగా కమ్యూనిస్టుల్లో, ఒక నేత అవ్వాల్సింది. ఒకవేళ బస్సు కాలువలో పడిపోయి మేమంతా చనిపోయినట్లయితే దేవతలు చేతులు చాచి “ఆ మహాపురుషుడు వస్తున్నాడు, ఎవడైతే ఒక చక్రం కోసం ప్రాణమిచ్చాడో కానీ ఆ చక్రం మార్చలేకపోయారు. అని అతని కోసం వేచి ఉండేవాళ్ళు”.
రెండవ చక్రం ను తగిలిస్తే మళ్లీ నడవ సాగింది. ఇప్పుడైతే మేము చేరుకోవాలనుకున్న సమయం కు చేరుకుంటామని నమ్మకం వదిలేశాం. నమ్మకమే కాదు ఎప్పుడైనా ఎక్కడికైనా చేరుకుంటామో లేదో అన్న ఆశని కూడా వదిలేశాము. జీవితమంతా ఈ బస్సులోనే గడిపేయాలేమో అని అనిపించింది, ఇంకా నేరుగా ఆ లోకాలకి ప్రయాణమై పోవాలేమో అని అనిపించింది, ఏ లోకానికైతే తిరిగి భూమిపై వచ్చే లక్ష్యం ఉండదు. మా యొక్క సహనం, టెన్షన్, ఒత్తిడి మొదలగున్నవి అన్నియు మాలో చరమగీతం పాడాయి అనగా అయిపోయాయి. మేము పెద్దవిరామంతో ఇంటివలె కూర్చోండిపోయాం. మా ఆందోళన కొనసాగుతూ ఉంది. మాలో మళ్లీ సరదా జోకులు, కొంటె మాటలు ఆరంభమైపోయాయి.
ఈ వీడియో కూడా తప్పకుండా చూడాలి ; Pain of 2000 Voters in India.
0 comments:
Post a Comment
For suggestions / doubts / complaints